Tuesday, May 31, 2011

ప్రేమా ! కాలమా !!

సముద్రతీరంలోని అడుగుజాడలా...

నశించని నా మనసులోని ఆవేదనను

అలలా నీవొచ్చి రూపు మాపి

కెరటపు ఆకాశపు బిందువులా...నాలో ఆశలు రేకేత్తిన్చావు .

ఆకాశమే నీ గమ్యమన్నావు . నేనే నీకు తోడన్నావు.

తొలకరి చినుకులా ..నను తాకి

పలికిన నీ పలుకులు , పువ్వులా నీ నవ్వులూ ...

నా నరనరాలలో మృదువైన నాదం పుట్టించాయి .

చేరువైన నీ స్నేహం , నీచూపులో కనిపించే ఆ ప్రేమ

నేను కడచేరే వరకూ... వుంటుందా ? అని నీతోపలికినపుడు

నీ మౌనమే అర్ధాంగీకారమని తెలియక

"నీ చుట్టూ తిరిగి తిరిగీ...తిరిగిరాని కాలాన్నెంతో వదిలేశానని"

నిను నిందించి దూరమైన వేల తెలిసింది.

"నీవులేకుండా గడిపే వెయ్యేళ్ళ బ్రతుకైనా

నీతో కలిసి సంతోషంగా బ్రతికే ఒక్కొక్షణానికి సమానమని".

కరిగిపోయిన కాలాన్ని నీ కనుల ముందుంచుతా నా చెలీ...

తిరిగి నా ప్రేమనంగీకరిస్తే ...

కాలాన్నైనా కాలదన్నుతా ...నా చెలీ ! " కనులముందు నీవుంటే "...

కలలనైనా ఓ కళగా నిజం చేస్తా నా నిశ్చలి

కనీసం కలలోనైనా నీ కరుణ కనిపిస్తుందంటే ...

మరుపు రాని నీ ప్రేమను మననం చేసుకుంటూ...

నీ ప్రేమ కోసం వేచి చూస్తూ...

నీ హృదయ ప్రతిధ్వని ....ఈ

BY...

భారతీవిశ్వనాథ్.S MCA