Thursday, August 18, 2011

Friday, August 12, 2011

నను మార్చవేమి కాలమా ....



Time is greate


ప్రతి రోజు అనుకుంటూనే వున్నా ....
రోజు నేను ఏదో మిస్సవుతున్నానని .
ప్రతి రోజు .....అనుకుంటూనే వున్నా...
ప్రతి క్షణం ఉపయోగించుకోవాలని.
ప్రతి రోజు అదే పనే ....అనుకునే పనే 
అనుకున్నది చేసే పనికాదు 
అలా చేస్తే ఇలావుంటాను అని కలలుగనే పనే ...
కన్నకలలు కడజేర్చి కళను నిరవేర్చేపని కాదు.
నిద్రంటే నాకు అసహ్యం
నిద్రవస్తే నిద్రకే నిద్ర తెప్పించేంత దాసోహం నేను 
ప్రీతిప్రదమైన వాటికి దాసోహం ఐతే కాలం వృధా...
అసహనప్రదమైన వాటికి దాసోహం ఐతే జీవితం వృధా...
నాకంటూ ఒకటుండాలి . నేనంటూ ఒకటి చేయాలి అని ..
మనసుపడ్డ వాటితో కాలం వృధాచేస్తూ...చేరాలిన గమ్యాన్ని చేజారకూడదని.
నా భవిష్యత్తుకు మంచి బ్రతుకునివ్వాలని 
ప్రతిరోజో అనుకుంటూనే వున్నా ...
నాలో వున్న ప్రతిభ ఏంటో నాకు తెలుసు...
ఏదో ఒకరోజు ...ఏదో ఒకటి సాధిస్తానని తెలుసు ...
 ఎప్పుడో ఒకప్పుడు ....యిప్పుడు ఎందుకు కాకూడదని ....
ప్రతి రోజు అనుకుంటూనే వున్నా....
రోజు రోజుకూ క్యాలండర్లో తేది మారుతూ వుంది
సంవత్సరాలతో క్యాలన్దర్లె మారుతున్నాయి.కాని..
నేను చేయాలనుకున్న పనుల్లో చలనం లేదు
నా యోచనల్లో మార్పులేదు
గడిచి పోతూనే వుంది కాలం గతమై..
నాతోనే వుంది కాలం నిజంమై 
నడిచి వస్తూనే ఉంది కాలం నా భవిష్యత్తై 
ఎదుట వుందని సంతోషించి కనుమూసి తెరిచేలోగ ..
.గతమైనదని బాధపడుతున్న...
ఇదే చేస్తున్న.
ఇదేచేస్తూన్నా..... నను మార్చవేమి కాలమా ... 
                                                                  BY .., 
                                                                     భారతీVశ్వనాథ్ .S
మీ గురించి తెలుసుకోండి ...........(what About U)
http://astrology.webdunia.com/telugu/predictions/Predictions.aspx?rashiId=1&rashiMode=1

Thursday, August 11, 2011

dhada movie review

http://andhravilas.com/telugunews/228046/2/p/dhada_movie_review_nagachaitanya_and_kajal_film_dhada_review.html

O kalama

ఓ కాలమా !

చేజారిన చోటే వెతుక్కోవడానికి వస్తువువు కావు

తిరిగి మళ్లీ సంపాదించుకోవచ్చు అనడానికి ..ధనం కావు

కనులుమూసి తెరిచేలోగ

భూ భ్రమణంలో కలిసిపోయే కాలానివిని నీవు.

గడిచిపోయిన కాలమా! మళ్లీ నీవు రావు

గడుస్తున్న కాలమా! నీ పని నీవు చేస్తూనే వున్నావు.

గడపాలని ఆశించే కాలమా! నీవు గడుస్తావో లేదో తెలియదు.

నిన్న గతం (" జరిగి పోయింది చరిత్ర ")

నేడు నిజం ( "జరుగుతున్నది నిజం")

రేపు ఊహ (" జరగబోయేది కల ")

నిన్నటికి నేడు రేపయితే....

రేపటికి నేడు నిన్నవుతుంది.

కమ్మని కబుర్లు చెప్పే కాలంలో(తో)....

వెన్నెల్లాంటి చల్లని స్నేహంతో....

ప్రయణం ఒక నిద్ర అయితే...

గమ్యం ఒక మేల్కొలుపు . "ఇదే జీవితం " అని

నన్ను నీ కాలగమన చక్రంలో కలుపుకొని

" కాలం గడిచిపోతున్నా ...,కళలు కంటున్నావెంటిరా ?" అని

నలుగురితో నాలుగు మాటలనిపిస్తావు. నీకిది న్యాయమా!

గడిచినది గడిచినట్లనిపించలేదు కాలమా !, నిన్ను నేను గమనిన్చెంతవరకు .

అందుకే.... నా నుండి చేజారి

కనుమరుగయ్యావని వెనుదిరిగి చూస్తూ ...

కనులముందున్న నిన్ను.., గుప్పిట్లో వున్న

నా భవిష్యత్తునూ .... చేజార్చుకోకూడదనుకున్నాను.

అందుకే... నిరతరం శ్రమించే నీ ఆదర్శంతో...

నీ వెంట నేను పయనించి శ్రమిద్దామనుకున్నాను.

రేపటిరోజు చేయాలని నేను కన్న కలలు

నిరవేరక (నిజంకాక ) బాదపడుతూ...

"జరిగిపోయన నిన్నటి చరిత్రగా చెప్పుకోకూదదని".

పయనించనా ... నా నేస్తమా! నేను నీతో కలిసి.

రచన..,

భారతీVశ్వనాథ్.S

http://viswa149.blogspot.com/