Friday, May 31, 2013

నువ్వు దగ్గరగా వున్నపుడు ఆనందమే ఆహారమయింది ..... 

నువ్వు దూరమయాక కన్నీరే దాహం తీరుస్తొంది .....  నా ప్రాణ సఖీ...... 

Monday, April 29, 2013

"కలం  పట్టిన కార్మికుడిని  నేను "
"కలం  పట్టిన కార్మికుడిని  నేను "

కలం  పట్టిన కార్మికుడిని  నేను 
కలమనే  అయుధంతో 
అక్షరరూపం  దాల్చిన "ఉధ్యమమే "  నా కవిత 
కార్మికుడి  కష్టంలో  
బయటపడ్డ "చెమటబొట్టు" నా అక్షరం 
జీవితమనే పుస్తకంలో 
ధనవంతుల  కాగితాల మద్యనలిగే 
"అక్షర కార్మికుడిని" నేను . 
కార్మిక అక్షరాలను  చేకూర్చి 
వాక్య  రూపందాల్చిన "కార్మిక వ్యవస్థ " నా వ్యాసం . 
మెరుపుల పిడిగుల వేగంతో ... 
లక్షమెదడులకు  పదును పెట్టె  "శరం"  నా మాట . 

సమాజంలాంటి  తోటలో 
అధికారమనే  మధమెక్కిన మత్తులో 
ముంచే గాంజాయి  మొక్కలను 

అడ్డంగా తెగనరికే  "ఖడ్గం" నా కలం.




అవినీతి  పరులైన 
లంచగొండులను దారిమల్లించి  
పూలబాటలో నడిపించే "అక్షరమాల" 
నా కవిత . 




మదంతో   మా...  దారి  మాదే అనే , మారని 
నీచుల పాలిట నిప్పుకణమై  రగిలే  "జ్వాల" నా కవిత. 

కార్మికుడు లేని కార్మిక వ్యవస్థ వుండదు . 
నా అక్షరం మొలవకుండా......  
ఖాళీ కాగితానికి విలువుండదు . 
కలంతో సాగించే పోరాటం నాది 
కవితలతో సాగించే "ఉద్యమం" నాది 
కలం పట్టిన కార్మికుడిని నేను . 
కార్మిక శ్రేయస్సే  నా ఫలితం . 
కార్మికుల అభిమానమే నా ఫలితం . 
కార్మిక సామ్రాజ్య నిర్మాణమే నా లక్ష్యం . 
వేతనమాసించని  కష్టజీవిని నేను . 
కలం పట్టిన కార్మికుడిని నేను . 
అమరులైనా స్మరించే 
స్మారక "కార్మిక ఉద్యమం " నా కవిత . 

BY
భారతీVశ్వనాధ రెడ్డి
                     

Wednesday, April 24, 2013


మది తలచిన వేల నీతో వుండాలి 
నా మనసు తెలిసిన నువ్వే నా ప్రేయసి కావాలి.

ఈ జన్మకు ఇది చాలు అనుకుంటాను
 నీతో వున్నా ప్రతి క్షణం
మరుజన్మకు మళ్ళీ మళ్ళీ  కావాలనుకుంటాను
అది నీ ప్రేమలో గొప్పతనం


BY

భారతీVశ్వనాధ రెడ్డి



Monday, April 8, 2013



మనం క్షణికావేశం  లో తీసుకునే  నిర్ణయాలు అన్నీ
సరియైనవి కాదు అని  చెప్పలేము .
అలాగని దీర్గం గా అలోచించి నిదానంగా చేసేవి అన్నీ
 సరియైనవి అని చెప్పలేము
తల రాతకు అన్నీ తక్కువే .


BY
భారతీVశ్వనాధ రెడ్డి
BY
Vశ్వనాధ రెడ్డి చండ్ర

Wednesday, April 3, 2013

పరిచయం , స్నేహం , అభిమానం , ప్రేమ, మరణం 
అన్నీ అనుకోకుండా జరిగినవే ..... నీ పరిచయం లాగ .


ఆనందం , దుఖం, బాధ, దురదృష్టం ,జీవితం .
అన్నీ చిన్నవే  నువ్వు  నాతో  గడిపిన  క్షణాల్లాగా 



నింగి , నేల , గాలి , నీరు , ప్రకృతి  యివన్నీ  శాశ్వితం 
నువ్వు  నాతో  వున్నపుడు నేను పొందిన మరువని మధుర జ్ఞాపకం లాగ
నాలో చెదిరిపోని నీ రూపం లాగా .. 





                                                            By
                                                  భారతీVశ్వనాధ రెడ్డి

Tuesday, April 2, 2013

నను తాకి నీవైపు చేరే చిరుగాలికి చెప్పను .
చిరునగవుల నా చెలి తనువును  తాకి  
నీ పరిమళాన్నిపెంచుకొమ్మని.

నను తడిపి నీవైపు పారే సెలయేటికి చెప్పను
నా ప్రాణం పాదాలు తాకి పుణ్యం చేసుకొమ్మని .
 

తనని చూడగానే పుట్టిన నా మధుర భావనకు చెప్పాను .
నా ప్రేమను తెలియచేయమని


 నా భావనలు అన్నీ తెలిసిన నా ప్రేయసితో  చెప్పను .
నువ్వు నేను అనే పదాలు మాత్రమే  వేరని, మనము ఒక్కటే అని .  
రెండు దేహాలతో జీవిస్తున్న  ఒకే హృదయాలమని .
                                                                                                                                                                                       By
                                                               భారతీVశ్వనాధ రెడ్డి     



Thursday, March 28, 2013


                                                              By
                                                      భారతీVశ్వనాధ రెడ్డి 

నిన్ను చుసిన ఆ క్షణాన
నా మాటలకేందుకు ఈ మౌనం
నా మనసుకు ఎందుకు ఈ ఉల్లాసం .
నా అడుగులకెందుకు ఈ తడబాటు .
నా కనులకు ఎందుకు ఎప్పుడూ  నిన్ను చూడాలనే ఆశ .... ఈ ఆకాంక్ష .
                                                           

                                                           By
                                                      భారతీVశ్వనాధ రెడ్డి