Sunday, November 27, 2011



                                
నీ కళ్ళలో ఏముందో మరి చూపు పడిందంటే  దక్కి తీరుతుంది .
నీ నవ్వులో ఏముందో మరి వాడిపోయిన పువ్వులు   సైతం వికసించెను .
నీ మాటల్లో ఏముందో మరి మూగబోయిన మువ్వలు సైతం మురిసిపోయేను
మౌనంగా మాట్లాడొచని నీ చూపుతో తెలిసింది 
                   
మౌనంగా మాట్లాడొచని నీ చూపుతో తెలిసింది
మనసుకు చూపుందని నీ మాటల్లో తెలిసింది 
కాలం ఎంత కటినమైనదో నీకై ఎదురుచూపులో తెలిసింది 
ఆనందపు అనుభూతి నీ అనుబంధం తో తెలిసింది 
అసలైన జీవితం నీ తోడులో  వుందని తెలిసింది. 
అందుకే 
నీ గుండెల ప్రతిధ్వని నాలో వినిపిస్తోంది ....
                                     
                                     By 
                            భారతీVశ్వనాధ రెడ్డి  

http://www.tupaki.com/news/view/Amala-Ready-for-Anything/6206


Sunday, November 6, 2011

నిజానికి ........ఊహకు మధ్య బ్రతుకుతున్న శవాన్ని  నేను
 నిజం నన్ను నడిపిస్తోంది ..ప్రాణమున్న శవంగా 
ఊహ నన్ను బ్రతికిస్తోంది ..నువ్వేదో  సాధించాలని...
కొన్ని నిజాలనైన అనుభవించి తట్టుకో గలమేమో.......కాని
కొన్ని ఊహలను అస్సలు భరించలేము.
ఆత్మ విశ్వాసం తో బ్రతుకుతున్నాను ......
నేనేంటో నిరూపించుకోవాలని. 

 By..... 
భారతీVశ్వనాధ రెడ్డి

Tuesday, November 1, 2011

"శ్వేత భారతం "


                                
నా కలం భారతికి కట్టిన కాళ్ళ గజ్జలు
ఎంత అందంగా ఉన్నాయి .
గజ్జెల శబ్దపు ధ్వనితో .., నా హృదయ వీణ పై
సరిగమల ప్రతిధ్వని పలికిస్తోంది.
తను నడిచే నడకతో  అడుగుల ముద్ర  అలా
నా గుండెల పై ముద్రిస్తూ వెళ్తోంది.
తను నడుస్తూ..., అడుగులో అడుగు వేస్తూ... వెళ్తుంటే ...
నా కలం భారతికి కట్టిన కాల గజ్జలు
ఇలా  అంటున్నాయి
""ఘల్లు ఘల్లుమని నడిచే నా గజ్జల శబ్దానికి
తెరలచాటున జరుగుతున్న
గుసగుసల రహస్యాలు ఆగిపోయి,
దొంగలు దొరలై సింహాసనమెక్కారు
నిజమనే నిప్పు నివురు కప్పుకుంది 
మనతోనే  వుండి , మన చుట్టే తిరుగుతూ...
పరాయి దేశపు ఎంగిలి మెతుకులకు ఆశపడి కిరతకలకు ఒడిగడుతుంటే...
గమనిద్ధామని తిన్నగా వెళ్లి తలుపు చాటునుండి తొంగి చూస్తుంటే
దొరకని దొంగల కళ్ళు
"దొంగలా ఆ నడకేంటి ? ఆ చూపేంటి ?
ఎందుకలా చూస్తున్నావు" అని నన్ను  నిలదీశాయి.
మరుసటి  రోజే మరో మారణ " హోమం"
అసలు  నిందితులు దొరకలేదు
దొరికిన వారు నిందితులు కారు..
మారణహోమ విధ్వంస ఖాండలో
"తెగిపడిన తలలు , పారుతున్న రక్తపుటేరులు
బోరుమని విలపించే .... ఆర్దానాదాలు "

అది ఈ సమాజ దుస్థితి
ఏమని చెప్పను ?
మారనహోమాలకు బలిపసువులైన అమాయకుల పరిస్థితి
అది చూసి మూగబోయిన నా భారతి పరిస్థితి
ఎటేల్లింది అభివృద్ధి చెందుతూ వున్న నా భారతం
మారణహోమాలు , హింసా ఖాండలు,
లంచగొండితనాలు అరాచకాలతో...
అభివృద్ధి చెందుతూ వుందని చెప్పనా? ఏమని చెప్పను?
పచ్చని  పైర్లతో.. కళకళలాడాల్సిన  నా భారతం
ఎర్రని రక్తపుతెర్లతో పారుతోందని చెప్పనా ? ఏమని చెప్పను ?
ఎటేల్లింది కళకళలాడుతూ వుండాలని
నే కళలు కన్నా "నా శ్వేత భారతం '

 By..... 
 భారతీVశ్వనాధ రెడ్డి 


http://www.telugupedia.com/wiki/index.php?title=Bharat_Mata