Monday, October 31, 2011

నీ ప్రేమనందుకోలేని ఈ నా జీవితం వృధా



నీ ప్రేమనందుకోలేని ఈ నా జీవితం వృధా ... అని 
ఈ ప్రాణం వదిలేయనా .........
నీ ప్రేమనోందే ఒక్క క్షణంమైనా  చాలు అని ........
ఈ జీవితం ఇలాగే కొనసాగించనా .....
నా ప్రేమను అంగీకరించే ఆ క్షణం వస్తుందని 
ఎదురు చూస్తూ ఉంటా నా చెలి ...ఎరుపెక్కిన ఈ నా కన్నులతో నీ కోసం  ..........
నా హృదయ ద్వారాలు తెరిచి వుంచుతా నా చెలి 
నా హృదయం లో ప్రవేశించే ఆ మధుర క్షణాలు వస్తాయని  నీ కోసం .
జీవం లేని నా ఊహలకు  ప్రాణం పోసిన నా నిశ్చలి ..
జీతం లేని సేవలు చేస్తా  జీవితమంతా నీ కోసం ........
నిన్నే తలుస్తూ ...నిన్నే స్మరిస్తూ 
 నీ  ఊహల శ్వాసతో బ్రతికే .........
నీ ......
 V శ్వనాధ రెడ్డి 


Saturday, October 22, 2011

.నీ రూపాన్ని చూసి నిజం తెలుసుకున్న ...

ఓ వ్యక్తి నాతో మాట్లాడుతూ...
"మాట్లాడే మల్లేని చూశానురా " అన్నాడు.
"కోతలు కోస్తున్నాడు " అనుకున్నాను.
"నేలమీద జాబిలిని"  చూశాను అన్నాడు.
జాలివేసింది వీదికేదో  అయింది అనుకున్నాను.
"నడిచే శిల్పాన్ని " చూశాను అన్నాడు.
"శిల్పాన్ని చూపించి నడిపించమన్నాను"
"నది అలలు పర్వతాల వైపు పారుతున్నయన్నాడు"
నన్ను పిచ్చోడిని చేశాడనిపించింది .
"సూర్య కాంతిలో చంద్రుడగుపడని రాత్రిని  చూశాను అన్నాడు."
"పగటి కలలు అలాగే  వుంటాయి రా... " అన్నాను.
"నేరేడు పళ్ళని శబ్దం రాకుండా తోరణాల తలుపులు కనువిందు చేస్తున్నాయన్నాడు.
వీడికి పిచ్చి పట్టిందనుకున్నాను....
నా నిర్ణయం పూర్తికాక ముందే ...
కదిలే కలంతో పాటు ...కోయిల స్వరం సాగి నన్ను  చేరింది 
అధిఇగో... నేను చెప్పిన " అజంతా శిల్ప సుందరి " అని 
ఆకాశంలోకి గంతేశాను  ఎదురుగా చూస్తే "నువ్వే" 
వాడిని కనువిందు చేసిన రాత్రిని నల్లని "నీ కురులలో" చూశాను .
 వాడిని మైమరిపించిన ఆ నేరేడు పళ్ళని "నీ కళ్ళలో  చూశాను .
మెలికలు తిరిగిన నీ నడుంవొంపులో "నది అలలు" చూశాను .
ఇంత సేపు నీ గురించి చెప్పిన ఆ వ్యక్తి " నా అంతరాత్మే "
నిను  చూడక ముందు "తను చెప్పినవన్నీ గొప్ప "అని అనుకున్నాను .
నిన్ను చూడగానే తను చెప్పింది చాల తక్కువ అనిపించింది .
"శిల్పా"నికి కూడా ప్రాణం పోయవచ్చు కాదు ....కాదు 
ప్రాణం పోసుకున్న  శిల్పనివి నీవు అని తెలుసుకున్నాను   
                                         
                                                                                        By.....

                                                                              భారతీVశ్వనాధ రెడ్డి .