Friday, April 7, 2017


రాత్రి పూట ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు కనిపిస్తాయి ....

సూర్యోదయం అయేసరికి అవి కనపడవు
అంత మాత్రాన ఆకాశంలో నక్షత్రాలు లేవని కాదు. 

Saturday, October 18, 2014

నీ ప్రేమనందుకోలేని ఈ నా జీవితం వృధా ... అని 
ఈ ప్రాణం వదిలేయనా .........

నీ ప్రేమనోందే ఒక్క క్షణంమైనా  చాలు అని ........
ఈ జీవితం ఇలాగే కొనసాగించనా .....
ఎదురు చూస్తూ ఉంటా నా చెలి ...ఎరుపెక్కిన ఈ నా కన్నులతో ..........
నా ప్రేమను అంగీకరించే ఆ క్షణం వస్తుందని నీ కోసం .

నా హృదయ ద్వారాలు తెరిచి వుంచుతా నా చెలి 

హృదయం లో ప్రవేశించే ఆ మధుర క్షణాలు వస్తాయని  నీ కోసం .
జీవం లేని నా ఊహలకు  ప్రాణం పోసిన నా నిశ్చలి ..
జీతం లేని సేవలు చేస్తా  జీవితమంతా నీ కోసం ........
నిన్నే తలుస్తూ ...నిన్నే స్మరిస్తూ 
 నీ  ఊహల శ్వాసతో బ్రతికే .........
నీ ......
V శ్వనాధ రెడ్డి

Sunday, February 16, 2014

                                                     

              ప్రాణం పోసుకున్న శిల్పానివని తెలుసుకున్నాను  .. 


ఓ కవి నాతో మాట్లాడుతూ ............. 
"మాట్లాడే మల్లెను చూశానురా " అన్నాడు 
కోతలు కోస్తున్నాడు అనుకున్నాను . 
నేలమీద జాబిల్లిని చూశానన్నాడు. 
జాలి వేసింది వీడికేదో అయిందని 
నడిచే శిల్పాన్ని చూశానన్నాడు.
శిల్పాన్ని చూపించి నడిపించమన్నాను . 
నది అలలు  పర్వతాల వైపు పారుతున్నాయన్నాడు. 
నన్ను పిచ్చోడిని చేశాడనిపించింది . 
 సూర్య కాంతిలో చంద్రుడగుపడని రాత్రిని చూశానన్నాడు.
"పగటి కలలు అలాగే వుంటాయిరా " అన్నాను.  
నేరేడు పళ్ళని .... శబ్దం రాకుండా తోరణాల తలుపులు కనువిందు చేస్తున్నాయన్నాడు
వీడికి పిచ్చిపట్టిందనుకున్నాను . 
నా నిర్ణయం పూర్తికాకముందే ... 
కదిలే కాలం తో పాటు ...... కోయిల స్వరం సాగి నన్ను చేరింది . 
అదిగో .... నేను చెప్పిన "అజంతా శిల్ప సుందరి" అని 
ఆకాశంలోకి గంతేశాను. 
ఎదురుగా చూస్తే నువ్వే ..... 
వాడు చూసిన " రాతిరిని" నల్లని నీ కురులలో చూశాను . 
వాడిని కనువిందు చేసిన " ఆ  నేరేడు  పళ్ళని " నీ  కళ్ళలో  చూశాను . 
మెలికలు తిరిగిన నడువొంపు లలో  "నది అలలు" చూశాను . 
యింతసేపు నీ గురించి చెప్పిన  ఆ కవి " నా అంతరాత్మ "
నిన్ను చూడక ముందు 
నీ గురించి చెప్పిన వన్ని గొప్ప  , అని అనుకున్నవన్నీ ..... 
నిన్ను చూడగానే తను చెప్పింది చాలా తక్కువనిపించింది. 
శిల్పానికి కూడా ప్రాణం పోయొచ్చు అని....  కాదు కాదు 
ప్రాణం పోసుకున్న శిల్పనివి నీవు అని తెలుసుకున్నాను . 

                                                   BY
                                       Vశ్వనాధ రెడ్డి







Friday, May 31, 2013

నువ్వు దగ్గరగా వున్నపుడు ఆనందమే ఆహారమయింది ..... 

నువ్వు దూరమయాక కన్నీరే దాహం తీరుస్తొంది .....  నా ప్రాణ సఖీ...... 

Monday, April 29, 2013

"కలం  పట్టిన కార్మికుడిని  నేను "
"కలం  పట్టిన కార్మికుడిని  నేను "

కలం  పట్టిన కార్మికుడిని  నేను 
కలమనే  అయుధంతో 
అక్షరరూపం  దాల్చిన "ఉధ్యమమే "  నా కవిత 
కార్మికుడి  కష్టంలో  
బయటపడ్డ "చెమటబొట్టు" నా అక్షరం 
జీవితమనే పుస్తకంలో 
ధనవంతుల  కాగితాల మద్యనలిగే 
"అక్షర కార్మికుడిని" నేను . 
కార్మిక అక్షరాలను  చేకూర్చి 
వాక్య  రూపందాల్చిన "కార్మిక వ్యవస్థ " నా వ్యాసం . 
మెరుపుల పిడిగుల వేగంతో ... 
లక్షమెదడులకు  పదును పెట్టె  "శరం"  నా మాట . 

సమాజంలాంటి  తోటలో 
అధికారమనే  మధమెక్కిన మత్తులో 
ముంచే గాంజాయి  మొక్కలను 

అడ్డంగా తెగనరికే  "ఖడ్గం" నా కలం.




అవినీతి  పరులైన 
లంచగొండులను దారిమల్లించి  
పూలబాటలో నడిపించే "అక్షరమాల" 
నా కవిత . 




మదంతో   మా...  దారి  మాదే అనే , మారని 
నీచుల పాలిట నిప్పుకణమై  రగిలే  "జ్వాల" నా కవిత. 

కార్మికుడు లేని కార్మిక వ్యవస్థ వుండదు . 
నా అక్షరం మొలవకుండా......  
ఖాళీ కాగితానికి విలువుండదు . 
కలంతో సాగించే పోరాటం నాది 
కవితలతో సాగించే "ఉద్యమం" నాది 
కలం పట్టిన కార్మికుడిని నేను . 
కార్మిక శ్రేయస్సే  నా ఫలితం . 
కార్మికుల అభిమానమే నా ఫలితం . 
కార్మిక సామ్రాజ్య నిర్మాణమే నా లక్ష్యం . 
వేతనమాసించని  కష్టజీవిని నేను . 
కలం పట్టిన కార్మికుడిని నేను . 
అమరులైనా స్మరించే 
స్మారక "కార్మిక ఉద్యమం " నా కవిత . 

BY
భారతీVశ్వనాధ రెడ్డి