Friday, May 31, 2013

నువ్వు దగ్గరగా వున్నపుడు ఆనందమే ఆహారమయింది ..... 

నువ్వు దూరమయాక కన్నీరే దాహం తీరుస్తొంది .....  నా ప్రాణ సఖీ...... 

Monday, April 29, 2013

"కలం  పట్టిన కార్మికుడిని  నేను "
"కలం  పట్టిన కార్మికుడిని  నేను "

కలం  పట్టిన కార్మికుడిని  నేను 
కలమనే  అయుధంతో 
అక్షరరూపం  దాల్చిన "ఉధ్యమమే "  నా కవిత 
కార్మికుడి  కష్టంలో  
బయటపడ్డ "చెమటబొట్టు" నా అక్షరం 
జీవితమనే పుస్తకంలో 
ధనవంతుల  కాగితాల మద్యనలిగే 
"అక్షర కార్మికుడిని" నేను . 
కార్మిక అక్షరాలను  చేకూర్చి 
వాక్య  రూపందాల్చిన "కార్మిక వ్యవస్థ " నా వ్యాసం . 
మెరుపుల పిడిగుల వేగంతో ... 
లక్షమెదడులకు  పదును పెట్టె  "శరం"  నా మాట . 

సమాజంలాంటి  తోటలో 
అధికారమనే  మధమెక్కిన మత్తులో 
ముంచే గాంజాయి  మొక్కలను 

అడ్డంగా తెగనరికే  "ఖడ్గం" నా కలం.




అవినీతి  పరులైన 
లంచగొండులను దారిమల్లించి  
పూలబాటలో నడిపించే "అక్షరమాల" 
నా కవిత . 




మదంతో   మా...  దారి  మాదే అనే , మారని 
నీచుల పాలిట నిప్పుకణమై  రగిలే  "జ్వాల" నా కవిత. 

కార్మికుడు లేని కార్మిక వ్యవస్థ వుండదు . 
నా అక్షరం మొలవకుండా......  
ఖాళీ కాగితానికి విలువుండదు . 
కలంతో సాగించే పోరాటం నాది 
కవితలతో సాగించే "ఉద్యమం" నాది 
కలం పట్టిన కార్మికుడిని నేను . 
కార్మిక శ్రేయస్సే  నా ఫలితం . 
కార్మికుల అభిమానమే నా ఫలితం . 
కార్మిక సామ్రాజ్య నిర్మాణమే నా లక్ష్యం . 
వేతనమాసించని  కష్టజీవిని నేను . 
కలం పట్టిన కార్మికుడిని నేను . 
అమరులైనా స్మరించే 
స్మారక "కార్మిక ఉద్యమం " నా కవిత . 

BY
భారతీVశ్వనాధ రెడ్డి
                     

Wednesday, April 24, 2013


మది తలచిన వేల నీతో వుండాలి 
నా మనసు తెలిసిన నువ్వే నా ప్రేయసి కావాలి.

ఈ జన్మకు ఇది చాలు అనుకుంటాను
 నీతో వున్నా ప్రతి క్షణం
మరుజన్మకు మళ్ళీ మళ్ళీ  కావాలనుకుంటాను
అది నీ ప్రేమలో గొప్పతనం


BY

భారతీVశ్వనాధ రెడ్డి



Monday, April 8, 2013



మనం క్షణికావేశం  లో తీసుకునే  నిర్ణయాలు అన్నీ
సరియైనవి కాదు అని  చెప్పలేము .
అలాగని దీర్గం గా అలోచించి నిదానంగా చేసేవి అన్నీ
 సరియైనవి అని చెప్పలేము
తల రాతకు అన్నీ తక్కువే .


BY
భారతీVశ్వనాధ రెడ్డి
BY
Vశ్వనాధ రెడ్డి చండ్ర