Sunday, February 16, 2014

                                                     

              ప్రాణం పోసుకున్న శిల్పానివని తెలుసుకున్నాను  .. 


ఓ కవి నాతో మాట్లాడుతూ ............. 
"మాట్లాడే మల్లెను చూశానురా " అన్నాడు 
కోతలు కోస్తున్నాడు అనుకున్నాను . 
నేలమీద జాబిల్లిని చూశానన్నాడు. 
జాలి వేసింది వీడికేదో అయిందని 
నడిచే శిల్పాన్ని చూశానన్నాడు.
శిల్పాన్ని చూపించి నడిపించమన్నాను . 
నది అలలు  పర్వతాల వైపు పారుతున్నాయన్నాడు. 
నన్ను పిచ్చోడిని చేశాడనిపించింది . 
 సూర్య కాంతిలో చంద్రుడగుపడని రాత్రిని చూశానన్నాడు.
"పగటి కలలు అలాగే వుంటాయిరా " అన్నాను.  
నేరేడు పళ్ళని .... శబ్దం రాకుండా తోరణాల తలుపులు కనువిందు చేస్తున్నాయన్నాడు
వీడికి పిచ్చిపట్టిందనుకున్నాను . 
నా నిర్ణయం పూర్తికాకముందే ... 
కదిలే కాలం తో పాటు ...... కోయిల స్వరం సాగి నన్ను చేరింది . 
అదిగో .... నేను చెప్పిన "అజంతా శిల్ప సుందరి" అని 
ఆకాశంలోకి గంతేశాను. 
ఎదురుగా చూస్తే నువ్వే ..... 
వాడు చూసిన " రాతిరిని" నల్లని నీ కురులలో చూశాను . 
వాడిని కనువిందు చేసిన " ఆ  నేరేడు  పళ్ళని " నీ  కళ్ళలో  చూశాను . 
మెలికలు తిరిగిన నడువొంపు లలో  "నది అలలు" చూశాను . 
యింతసేపు నీ గురించి చెప్పిన  ఆ కవి " నా అంతరాత్మ "
నిన్ను చూడక ముందు 
నీ గురించి చెప్పిన వన్ని గొప్ప  , అని అనుకున్నవన్నీ ..... 
నిన్ను చూడగానే తను చెప్పింది చాలా తక్కువనిపించింది. 
శిల్పానికి కూడా ప్రాణం పోయొచ్చు అని....  కాదు కాదు 
ప్రాణం పోసుకున్న శిల్పనివి నీవు అని తెలుసుకున్నాను . 

                                                   BY
                                       Vశ్వనాధ రెడ్డి







No comments:

Post a Comment