ఓ వ్యక్తి నాతో మాట్లాడుతూ...
"మాట్లాడే మల్లేని చూశానురా " అన్నాడు.
"కోతలు కోస్తున్నాడు " అనుకున్నాను.
"నేలమీద జాబిలిని" చూశాను అన్నాడు.
జాలివేసింది వీదికేదో అయింది అనుకున్నాను.
"నడిచే శిల్పాన్ని " చూశాను అన్నాడు.
"శిల్పాన్ని చూపించి నడిపించమన్నాను"
"నది అలలు పర్వతాల వైపు పారుతున్నయన్నాడు"
నన్ను పిచ్చోడిని చేశాడనిపించింది .
"సూర్య కాంతిలో చంద్రుడగుపడని రాత్రిని చూశాను అన్నాడు."
"పగటి కలలు అలాగే వుంటాయి రా... " అన్నాను.
"నేరేడు పళ్ళని శబ్దం రాకుండా తోరణాల తలుపులు కనువిందు చేస్తున్నాయన్నాడు.
వీడికి పిచ్చి పట్టిందనుకున్నాను....
నా నిర్ణయం పూర్తికాక ముందే ...
కదిలే కలంతో పాటు ...కోయిల స్వరం సాగి నన్ను చేరింది
అధిఇగో... నేను చెప్పిన " అజంతా శిల్ప సుందరి " అని
ఆకాశంలోకి గంతేశాను ఎదురుగా చూస్తే "నువ్వే"
వాడిని కనువిందు చేసిన రాత్రిని నల్లని "నీ కురులలో" చూశాను .
వాడిని మైమరిపించిన ఆ నేరేడు పళ్ళని "నీ కళ్ళలో " చూశాను .
మెలికలు తిరిగిన నీ నడుంవొంపులో "నది అలలు" చూశాను .
ఇంత సేపు నీ గురించి చెప్పిన ఆ వ్యక్తి " నా అంతరాత్మే "
నిను చూడక ముందు "తను చెప్పినవన్నీ గొప్ప "అని అనుకున్నాను .
నిన్ను చూడగానే తను చెప్పింది చాల తక్కువ అనిపించింది .
"శిల్పా"నికి కూడా ప్రాణం పోయవచ్చు కాదు ....కాదు
ప్రాణం పోసుకున్న శిల్పనివి నీవు అని తెలుసుకున్నాను
By.....
భారతీVశ్వనాధ రెడ్డి .
మీ గురించి తెలుసుకోండి ...........(what About U)
http://astrology.webdunia.com/telugu/predictions/Predictions.aspx?rashiId=1&rashiMode=1
http://astrology.webdunia.com/telugu/predictions/Predictions.aspx?rashiId=1&rashiMode=1
No comments:
Post a Comment