Thursday, August 11, 2011

O kalama

ఓ కాలమా !

చేజారిన చోటే వెతుక్కోవడానికి వస్తువువు కావు

తిరిగి మళ్లీ సంపాదించుకోవచ్చు అనడానికి ..ధనం కావు

కనులుమూసి తెరిచేలోగ

భూ భ్రమణంలో కలిసిపోయే కాలానివిని నీవు.

గడిచిపోయిన కాలమా! మళ్లీ నీవు రావు

గడుస్తున్న కాలమా! నీ పని నీవు చేస్తూనే వున్నావు.

గడపాలని ఆశించే కాలమా! నీవు గడుస్తావో లేదో తెలియదు.

నిన్న గతం (" జరిగి పోయింది చరిత్ర ")

నేడు నిజం ( "జరుగుతున్నది నిజం")

రేపు ఊహ (" జరగబోయేది కల ")

నిన్నటికి నేడు రేపయితే....

రేపటికి నేడు నిన్నవుతుంది.

కమ్మని కబుర్లు చెప్పే కాలంలో(తో)....

వెన్నెల్లాంటి చల్లని స్నేహంతో....

ప్రయణం ఒక నిద్ర అయితే...

గమ్యం ఒక మేల్కొలుపు . "ఇదే జీవితం " అని

నన్ను నీ కాలగమన చక్రంలో కలుపుకొని

" కాలం గడిచిపోతున్నా ...,కళలు కంటున్నావెంటిరా ?" అని

నలుగురితో నాలుగు మాటలనిపిస్తావు. నీకిది న్యాయమా!

గడిచినది గడిచినట్లనిపించలేదు కాలమా !, నిన్ను నేను గమనిన్చెంతవరకు .

అందుకే.... నా నుండి చేజారి

కనుమరుగయ్యావని వెనుదిరిగి చూస్తూ ...

కనులముందున్న నిన్ను.., గుప్పిట్లో వున్న

నా భవిష్యత్తునూ .... చేజార్చుకోకూడదనుకున్నాను.

అందుకే... నిరతరం శ్రమించే నీ ఆదర్శంతో...

నీ వెంట నేను పయనించి శ్రమిద్దామనుకున్నాను.

రేపటిరోజు చేయాలని నేను కన్న కలలు

నిరవేరక (నిజంకాక ) బాదపడుతూ...

"జరిగిపోయన నిన్నటి చరిత్రగా చెప్పుకోకూదదని".

పయనించనా ... నా నేస్తమా! నేను నీతో కలిసి.

రచన..,

భారతీVశ్వనాథ్.S

No comments:

Post a Comment